Southwest Monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు.. 3 రోజుల ముందే పలకరింపు!

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే 

Updated : 29 May 2022 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశ వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతి రుతుపవనాలు తాజాగా కేరళను తాకాయి. సాధారణ తేదీ(జూన్ 1) కంటే మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళలో ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27నే అవి కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ విభాగం తొలుత అంచనా వేసింది. 

మరోవైపు కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు మరో వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని