జూమ్‌ వేదికగా నేడు ఎస్పీ బాలు జయంతి సభ

తెలుగు సాహిత్య వారధి సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సభను ఆన్‌లైన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు.

Updated : 04 Jun 2021 14:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సాహిత్య వారధి సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సభను ఆన్‌లైన్‌లో జూమ్‌ యాప్‌ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు బాధ్యులు అట్లూరి వెంకటరమణ తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, గౌరవ అతిథులుగా రచయితలు రామజోగయ్యశాస్త్రి, తనికెళ్ల భరణి, చంద్రబోస్‌, బుర్రా సాయిమాధవ్‌, అనంత శ్రీరామ్‌ తదితరులు హాజరవుతారన్నారు. తెలుగు కవులు, రచయితలు, గాయకులు, సంగీత దర్శకులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని