కోటప్పకొండ ప్రభలపై ఆంక్షలు విధించలేదు: ఎస్పీ

శివరాత్రిని పురస్కరించుకుని నరసరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దనే ఆంక్షలు విధించలేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం..

Published : 01 Mar 2021 01:22 IST

గుంటూరు: శివరాత్రిని పురస్కరించుకుని నరసరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దనే ఆంక్షలు విధించలేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభల ఏర్పాటు అనుమతిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఏటా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసే ప్రభలపై ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు తిరునాళ్లు జరుపుకోవచ్చని ఎస్పీ తెలిపారు. మతాచారాలకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని