ఆ జలపాతంపై రెండు పల్టీలు కొట్టిన తొలివ్యక్తి

స్పెయిన్‌కు సాహస యాత్రికుడు యానియోల్‌ సెర్రాసలోస్‌ అరుదైన ఘనత సాధించాడు. స్కేటింగ్‌ బోట్‌ను తలపించే కయాక్‌పై మంచుకొండ నుంచి జలపాతం మీదుగా భూమిపైకి చేరే క్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు....

Published : 09 Apr 2021 23:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్పెయిన్‌ సాహస యాత్రికుడు యానియోల్‌ సెర్రాసలోస్‌ అరుదైన ఘనత సాధించాడు. స్కేటింగ్‌ బోట్‌ను తలపించే కయాక్‌పై మంచుకొండ నుంచి జలపాతం మీదుగా భూమిపైకి చేరే క్రమంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. జలపాతంపై 360 డిగ్రీల్లో రెండు పల్టీలు కొట్టిన తొలి వ్యక్తిగా ఘనత సాధించాడు. చిలీలోని ఓ మంచు పర్వతంపై నుంచి గంటకు 60 మైళ్ల వేగంతో కిందకు దూసుకొచ్చిన యానియోల్‌.. అడవులు, సెలయేళ్లు, జలపాతాల మీదుగా తన ప్రయాణాన్ని సాగించాడు. ఈ క్రమంలో విల్లారికా అగ్నిపర్వతాన్ని సైతం దాటి ముందుకు దూసుకెళ్లిన అతడు జలపాతంపై డబల్‌ ఫ్లిప్‌ సాధించాడు. ఈ సాహస యాత్రికుడి ప్రయాణాన్ని అద్భుత రీతిలో చిత్రీకరించారు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి..



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని