TTD: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు : తితిదే

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. 

Updated : 08 Apr 2022 06:21 IST

తిరుమల: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్ణయించింది. రేపటి నుంచి ఆన్‌లైన్‌లో ప్రత్యేక దర్శనం టోకెన్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఏప్రిల్‌ నెల కోటా టోకెన్లను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, దివ్యాంగులకు రోజకు వెయ్యి టికెట్ల చొప్పున జారీ చేయనున్నట్లు వెల్లడించింది. టికెట్లు పొందిన భక్తులను రోజూ ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తారు. శుక్రవారం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు తితిదే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని