Koppula Eshwar: హజ్‌ యాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు.. జూన్ 5 నుంచి చార్టర్డ్‌ విమానాలు: మంత్రి కొప్పుల

హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు.

Published : 29 May 2023 17:19 IST

హైదరాబాద్‌: హజ్ యాత్రికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హజ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది హజ్ వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చినట్టు మంత్రి చెప్పారు. హైదరాబాద్‌ హజ్ హౌస్‌లో అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చినట్లు పేర్కొన్నారు.

‘‘యాత్రికుల వసతి, బస, విమానాల టికెట్ బుకింగ్, బోర్డింగ్ సౌకర్యాల విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. హైదరాబాద్ హజ్‌హౌస్‌లో పాసులు, సామాను స్ర్కీనింగ్, చెక్ ఇన్, మెడికల్, టీకా వంటివి ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏటా దాదాపు 7 వేల మంది హైదరాబాద్ నుంచి హజ్‌యాత్రకు వెళ్తున్నారు. వారికోసం జూన్ 5 నుంచి హజ్ చార్టర్డ్‌ విమానాలు నడుపుతాం. యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని మంత్రి సూచించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని