వీరి కుమారుడి సమస్య.. వాళ్లకు వరమైంది
సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడంచేతివాటమున్న వాళ్లు కాస్త ప్రత్యేకం. వస్తువులను కుడిచేతి వాళ్లు పట్టుకున్నట్లుగా ఎడంచేతివాటం వాళ్లు పట్టుకోలేరు. ముఖ్యంగా పెన్నుతో కుడిచేతి వాటం ఉన్నవాళ్లు రాసినంతా వేగంగా.. ఎడం చేతివాటం వారు రాయలేరు. ఇలాంటి ఇబ్బంది
(ఫొటో: ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ ఫేస్‌బుక్)
ఇంటర్నెట్ డెస్క్: సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎడమ చేతివాటమున్న వాళ్లు కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా పెన్నుతో కుడిచేతి వాటం ఉన్నవాళ్లు రాసే మాదిరిగా ఎడం చేతివాటం వారు రాయలేరు. ఇలాంటి ఇబ్బంది గురీందర్‌సింగ్ అనే బాలుడికి ఐదేళ్ల కిందట మొదలైంది. అతడు ఐదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్లు నోట్స్ చెప్పే సమయంలో వేగంగా రాయలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో చదువుపై ఆసక్తి తగ్గిపోయింది. అతడిలో సమస్య ఎక్కడుందో తల్లిదండ్రులు సందీప్, పవీత్తర్ గుర్తించారు. దేశంలో ఎడమ చేతివాటం వాళ్లకు ప్రత్యేక పెన్నులు పెద్దగా అందుబాటులో లేవని గుర్తించి వారే స్వయంగా ఒక స్టార్టప్ ప్రారంభించారు. ఎడమ చేతివారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెన్నులుతోపాటు అనేక వస్తువులను తక్కువ ధరకు ఆన్‌లైన్‌లో అమ్ముతూ దేశంలో ఈ తరహా తొలి స్టోర్ ప్రారంభించినవారిగా గుర్తింపు పొందారు.
అన్ని పెన్నులు.. కుడిచేయితో రాసేవారికి అనుగుణంగా ఉంటాయి. ఎడంచేతివాటం వాళ్లు ఆ పెన్నులతో రాస్తున్నప్పుడు ముందు పదాలను చూడలేరు. దీంతో రాయడంలో వెనుకబడుతుంటారు. ఇదే సమస్యతో గురీందర్ సింగ్ బాధపడ్డారు. నిజానికి ఇలాంటి వారి కోసం విదేశాల్లో ప్రత్యేక పెన్నులు ఉన్నాయి. పెన్ను పట్టుకునే చోటులో ఎడంచేతివాటం వాళ్లకు అక్షరాలు కనిపించేవిధంగా కాస్త వొంపు ఉంటుంది. చాలా మందికి వీటి గురించి తెలియదు. అయితే, వారి కుమారుడికి ఇలాంటి పెన్ను కొనివ్వాలని భావించారు. కానీ, వాటి ధర రూ.వేలల్లో ఉండటం చూసి కంగుతిన్నారు. దేశీయంగా పెన్నుల తయారీ కంపెనీల వద్దకు వెళ్లి సంప్రదిస్తే.. డిమాండ్ ఉంటేనే తయారు చేస్తామని చెప్పారు. దీంతో వారికి ఒక ఆలోచన వచ్చింది. తామే ఎడమ చేతివాటం వారి కోసం ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందా.. అని. వెంటనే దేశంలో ఎడమ చేతివాటమున్న వారి లెక్క బయటకు తీశారు. దేశ జనాభాలో 8శాతం మంది అంటే 10కోట్లకుపైగానే ఇలాంటివారు ఉన్నట్లు గుర్తించారు.
(ఫొటో: ది లెఫ్ట్ హ్యాండ్ షాప్ వెబ్‌సైట్)
స్టార్టప్ ఏర్పాటు ఇలా..
ఆన్‌లైన్‌లోనే ఎడమ చేతివాటం వారి కోసం ప్రత్యేక స్టోర్ ఏర్పాటు చేస్తే ఆదరణ లభిస్తుందని సందీప్, పవీత్తర్ గట్టిగా నమ్మారు. దీంతో 2016లో ‘ది లెఫ్ట్‌హ్యాండ్ షాప్’ పేరుతో ఆన్‌లైన్ పోర్టల్ ప్రారంభించారు. దేశవిదేశాల్లోని పెన్నుల సంస్థలతో చర్చలు జరిపారు. భారతదేశంలోనూ ఈ వస్తువులకు మార్కెట్ ఉందని వెల్లడించి.. ఒప్పించి తక్కువ ధరలతో ప్రత్యేక పెన్నులు తయారు చేయించడం మొదలుపెట్టారు. వాటితో ఆగిపోలేదు.. ఎడమచేతివాటం వారికి అవసరమయ్యే ఇతర వస్తువులను సైతం ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. గత నాలుగేళ్లలో 50వేల మంది నుంచి అనేక వస్తువులకు ఆర్డర్స్ రావడం విశేషం. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగి.. తమ స్టార్టప్ మరింత అభివృద్ది చెందుతుందని భావిస్తున్నారు. అయితే, సందీప్, పవీత్తర్ కృషి కారణంగా దేశంలో ఎడమ చేతివాటం ప్రత్యేక పెన్నుల ధర బాగా తగ్గి అటుఇటుగా రూ.వందకే లభిస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్‌షాప్స్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి. కానీ, ఎడం చేతివాటం వారి కోసం ప్రత్యేకంగా పెన్నులు, కత్తెరలు, షార్ప్‌నర్స్, స్కెచ్‌లు, స్పోర్ట్స్ కిట్ ఇలా అన్ని రకాల వస్తువులు కేవలం ‘ది లెఫ్ట్‌హ్యాండ్ షాప్’లోనే లభిస్తున్నాయి. దీంతో ఈ ఎడమచేతివాటం వాళ్లకు సౌలభ్యంగా ఉండే వస్తువులు లభించడం సులువైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పని లేకుండా ఈ షాప్ నుంచే వస్తువుల్ని కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఈ స్టార్టప్ ప్రారంభించిన దంపతులు హైదరాబాద్‌కు చెందిన వారు కావడం విశేషం. మొదట పుణెలో ఉంటూ ఈ స్టార్టప్ ప్రారంభించగా.. రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు. స్టార్టప్ ప్రారంభించిన నాలుగేళ్లలో 50వేల మంది ఎడమచేతివాటమున్న వాళ్లను తమ రెగ్యులర్ కస్టమర్లుగా మార్చుకున్నారు. అంతేకాదు.. ఇలాంటి వారి కోసం అప్పుడప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Hyderabad: జూబ్లీహిల్స్‌లో రూ.1.2 కోట్లతో డ్రైవర్ పరారీ
-
Ap-top-news News
UPSC-Civils: కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష!
-
Crime News
Hyderabad-Banjara Hills: బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
-
General News
Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్.. సీఎంతో మాట్లాడిన జస్టిస్ పి.కె.మిశ్ర
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Ap-top-news News
Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?