Kakinada: పులిని బంధించే చర్యలు వేగవంతం.. రంగంలోకి విశాఖ జూ అధికారులు

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులిని బంధించే చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది.

Updated : 30 May 2022 13:38 IST

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులిని బంధించే చర్యలను అటవీశాఖ వేగవంతం చేసింది. డీఎఫ్‌వో ఐకేవీ రాజు ఆధ్వర్యంలో 150 మంది సిబ్బంది పులిని బంధించేందుకు గస్తీ కాస్తున్నారు. నిన్న పులి మరోసారి సంచరించినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. పోతులూరు సమీపంలో 80 అడుగుల గుట్టపై దాన్ని గుర్తించారు.

పులిని బంధించేందుకు మూడు బోన్లను సిద్ధంగా ఉంచారు. సరుగుడు పొలాల నుంచి బోన్లు తరలించేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు. పులిని పట్టుకునే ఆపరేషన్‌లో విశాఖ జూ అధికారులు పాల్గొంటున్నారు. పులి జాడ కోసం 40 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి కనిపించిందంటూ అక్కడక్కడా వినిపిస్తున్న వదంతులను నమ్మొదంటూ స్థానిక ప్రజలకు అధికారులు సూచించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని