ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా?

జమ్మూ- కశ్మీర్‌ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. అక్కడి దాల్‌ సరస్సు, వైష్ణో దేవాలయం, ఇందిరాగాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. తాజాగా ఈ జాబితాలో ఓ రైల్వే బ్రిడ్జి చేరనుంది.

Published : 22 Dec 2021 01:15 IST

శ్రీనగర్‌‌: జమ్మూ- కశ్మీర్‌ అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడి దాల్‌ సరస్సు, వైష్ణో దేవాలయం, ఇందిరాగాంధీ మెమోరియల్‌ తులిప్‌ గార్డెన్‌.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. తాజాగా ఈ జాబితాలో ఓ రైల్వే బ్రిడ్జి చేరనుంది. అదే చీనాబ్‌ బ్రిడ్జి. రేసీ జిల్లాలో నిర్మితమవుతున్న ఈ వంతెన విశేషాలు, ఫొటోలను కేంద్రమంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ సోమవారం ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు ‘ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వంతెన కోసం 1315 మీటర్ల పొడవైన ఆర్చ్‌ ఏర్పాటు చేశారు. నదీ మట్టానికి 359 మీటర్ల ఎత్తులో కడుతున్న ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వేవంతెనగా నిలుస్తుంది. ఈ ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే ఎక్కువే’ అని ట్వీట్‌ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణ బాధ్యతలను భారతీయ రైల్వే తీసుకుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని