Anurag Thakur: క్రీడల మంత్రి స్కిప్పింగ్‌..

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి సారిస్తారనే విషయం తెలిసిందే. ఆయన మరోసారి స్కిప్పింగ్‌ చేసి అందర్నీ అలరించారు

Published : 11 Oct 2021 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి సారిస్తారనే విషయం తెలిసిందే. ఆయన మరోసారి స్కిప్పింగ్‌ చేసి అందర్నీ అలరించారు. ఇంతకు ముందు జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ‘ఫిట్‌ ఇండియా’ యాప్‌ ఆవిష్కరణలో భాగంగా ఆయన స్కిప్పింగ్‌ చేశారు. తాజాగా ఇండియా టూడే కాన్‌క్లేవ్‌-2021లో పాల్గొని తన స్కిప్పింగ్‌ నైపుణ్యాలను మరోసారి చూపించారు. దీన్ని చూసిన ప్రముఖులు, ప్రేక్షకులు హర్షాతిరేకాలు వ్యక్తపరిచారు. ఈ వీడియోను అనురాగ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పొందుపరచడంతో నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమావేశంలో అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ.. భారతదేశం  క్రీడలకు నిలయంగా మారుతుందన్నారు. ఔత్సాహికులైన క్రీడాకారులను వెలికితీయాలంటే మరిన్ని పోటీలు నిర్వహించాల్సి ఉంటుదని తెలిపారు. ముందుగా దేశంలో క్రీడా సంస్కృతిని సృష్టించాలన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించి వారికి సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీకి క్రీడల పట్ల ఆసక్తి ఉందని.. దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించటానికి ఆయన కూడా కృషి చేస్తున్నారని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని