Squirrel: భారత్‌ టు స్కాట్లాండ్‌.. ఓ ఉడుత సముద్ర యాత్ర!

ఒక ఉడుత సాహస యాత్రే చేసింది! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేల మైళ్ల దూరం ప్రయాణించింది. భారత్‌నుంచి బయల్దేరిన ఓ బోటులోకి ఎక్కేసిన ఆ ప్రాణి.. దాదాపు మూడు వారాల సముద్రయానం...

Published : 06 Sep 2022 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: ఒక ఉడుత పెద్ద సాహస యాత్రే చేసింది! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వేల మైళ్ల దూరం ప్రయాణించింది. భారత్‌నుంచి బయల్దేరిన ఓ బోటులోకి ఎక్కేసి.. దాదాపు మూడు వారాల సముద్రయానం తర్వాత బ్రిటన్‌లోని స్కాట్లాండ్‌కు చేరుకుంది. తీరా అక్కడికి వెళ్లాక బోటులో దాన్ని చూసిన సిబ్బంది.. స్థానిక జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించారు. అక్కడి అబెర్‌డీన్‌షైర్‌లోని నార్త్ ఈస్ట్ వైల్డ్‌లైఫ్, యానిమల్ రెస్క్యూ సెంటర్ సభ్యులు వచ్చి దాన్ని రక్షించారు. పెట్‌ క్యారియర్‌లో ఉంచి.. ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘భారత్‌లో 40కిపైగా ఉడత జాతులు ఉన్నాయి. ఈ ఉడుతను.. ఇండియన్‌ పామ్‌ స్క్విరల్‌గా గుర్తించాం. దీన్ని త్రీ స్ట్రిప్డ్‌ పామ్‌ స్క్విరల్‌గానూ పిలుస్తారు.’ అని రాసుకొచ్చారు. దాదాపు మూడు వారాల ప్రయాణం తర్వాత కూడా చాలా చురుగ్గా, ఫిట్‌గా ఉండటంతో.. దానికి ‘జిప్పీ’ అని పేరు కూడా పెట్టారు. జిప్పీ ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం దానికోసం స్థానికంగా కొత్త ఇంటిని వెతికే పనిలో పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని