Bhadrachalam: వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు.
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారికి శుక్రవారం పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానాలయంలో స్వామివారిని కల్పవృక్షవాహనంపై వూరేగింపు నిర్వహించారు. అనంతరం సామూహిక పారాయణం, హోమాలు చేశారు. రాములవారిని మిథిలా మండపానికి చేర్చే సమయంలో ‘జైశ్రీరామ్’ అంటూ భక్తులు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా పట్టాభిషేక మహోత్సవం గురించి అర్చకులు చేసిన ప్రవచనం అలరించింది. ఇటీవల దేశంలో నలు వైపులా ఉన్న పుణ్య నదులు నుంచి వైదిక సిబ్బంది సేకరించిన పుష్కర తీర్థాలను పట్టాభిషేకానికి తీసుకొచ్చారు. తొలుత మిథిలా మండపం వద్ద ఉంచి వాటికి ఆవాహన పూజలు చేశారు. ఈ నదీ జలాల విశిష్టతను వేద పండితులు వివరించారు. వేడుకను వీక్షించిన భక్తులందరికీ సకల శుభాలు కలగాలని ఆశీస్సులు అందించారు.
రామయ్యకు గవర్నర్ ప్రత్యేక పూజలు
శ్రీరామ పట్టాభిషేక ఉత్సవాలను తిలకించేందుకు గవర్నర్ తమిళిసై భద్రాచలం వచ్చారు. ప్రధానాలయంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు ఈవో రమాదేవి సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రధానాలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీతాయారమ్మలను గవర్నర్ దర్శించుకున్నారు. అనంతరం పట్టాభిషేకం నిర్వహిస్తున్న మిథిలా మండపానికి చేరుకుని ఈ క్రతువును వీక్షించారు. ఈ వేడుకల్లో త్రిదండి దేవనాథ జీయర్ స్వామి, జిల్లా కలెక్టర్ అనుదీప్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ వినీత్, ఏఎస్పీ పరితోష్, ఐటీడీఏ పీవో గౌతమ్, ఆర్డీవో రత్నకల్యాణి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
-
General News
Weather Update: తెలంగాణలో మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు
-
Crime News
Hyderabad: ఒక్క మిస్డ్ కాల్తో రెండు జీవితాలు బలి.. రాజేశ్ మృతి కేసులో కీలక ఆధారాలు
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి