Samatha Murthy: శ్రీరామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు: 9 మంది జీయర్‌స్వాములతో మంత్ర అనుష్టానం..

నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు కార్యక్రమాల్లో భాగంగా

Updated : 04 Feb 2022 12:22 IST

హైదరాబాద్‌: నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు కార్యక్రమాల్లో భాగంగా అష్టాక్షరీ మహామంత్ర జపం నిర్వహించారు. త్రిదండి చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో ప్రధాన యాగశాల మండపంలో 9 మంది జీయర్‌ స్వాములు మంత్ర అనుష్టానం చేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్‌ స్వామి మాట్లాడుతూ అనుష్టానం వల్ల మన చుట్టూ ఉండే వాతావరణం పవిత్రమవుతుందని చెప్పారు. ప్రేమతో ఈ మంత్ర అనుష్టానం చేయడం వల్ల భక్తుల్లో మానసిక బలం కలుగుతుందన్నారు. లక్ష్మీనారాయణ మహాయాగం క్రతువు ముగిసే వరకు కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు యాగశాల సమీపంలోని ప్రవచన మండపంలో అష్టో్త్తర శత పూజను చిన్నజీయర్‌ స్వామి ప్రారంభించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని