Sri Ramappa Temple: ఔరా అనిపించే ‘రామప్ప’ శిల్ప సౌందర్యం

పాలంపేట అనే ఊరు పేరు పెద్దగా తెలియదేమో కానీ.. రామప్ప దేవాలయం అనగానే వెంటనే గుర్తుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం రామప్ప దేవాలయం ఉన్న ప్రాంతం ములుగు జిల్లాలోని పాలంపేట.

Published : 28 Jul 2021 00:03 IST

పాలంపేట అనే ఊరు పేరు పెద్దగా తెలియదేమో కానీ.. రామప్ప దేవాలయం అనగానే వెంటనే గుర్తుకు వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రం రామప్ప దేవాలయం ఉన్న ప్రాంతం ములుగు జిల్లాలోని పాలంపేట. రామలింగేశ్వర స్వామి లీలా విశేషాలతో ఈ ప్రాంతం పునీతమైంది. రెండు రోజుల కిందట యునెస్కో వారి దస్త్రాల్లోకి రామప్ప ఆలయం ఎక్కింది. పాలంపేట రామప్పగుడికి ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. శిల్పి రామప్ప పేరిటే ఆ ఆలయాన్ని పిలవడం విశేషం. చారిత్రక, పౌరాణిక ప్రాధాన్యాలను సంతరించుకుంది రామలింగేశ్వర స్వామి ఆలయం. క్రీ.శ 1213వ ఏట రేచర్ల రుద్రుడు కట్టించినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. అత్యంత సుందరమైన శిల్పాలున్న ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. మదనిక, నాగిని శిల్పాలు చక్కని కాకతీయ శిల్పశైలికి తార్కాణంగా నిలుస్తాయి. మనోహరమైన శిల్పరాజాలు ఎన్నో భక్తులను మైమరిచేలా చేస్తాయి. ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయం పూర్తి విశేషాలు మీ ‘తీర్థయాత్ర’ వీడియోలో వీక్షించి తరించండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని