Sridhar Babu: ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు

తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

Published : 24 Jun 2024 14:14 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు - సమ్మిళిత అభివృద్ధి’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని తెలిపారు. వాళ్లు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందన్నారు.

ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తోందని శ్రీధర్‌బాబు చెప్పారు. అందులో మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామన్నారు. పారిశ్రామిక విధానంలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల ఐటీ కంపెనీలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో పరిశ్రమలు, మిగతా ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామని శ్రీధర్‌బాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని