srinivasananda saraswati: శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం!

తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు.

Updated : 28 Jun 2024 13:12 IST

తిరుమల: తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. తిరుమలలోని విశాఖ శారదా పీఠం ఆక్రమణలను ఏపీ సాధు పరిషత్తు స్వామీజీలు పరిశీలించారు. అనంతరం శ్రీనివాసానంద సరస్వతి మీడియాతో మాట్లాడారు.

‘‘తిరుమలలో విశాఖ శారదా పీఠాన్ని వ్యాపార పీఠంగా మార్చేశారు. ఇక్కడ ఒక్కరికీ అన్నం పెట్టడం లేదు.. పూజలు చేయడం లేదు. 4 అంతస్తులకు అనుమతి ఇస్తే.. 6 అంతస్తుల నిర్మాణం చేపట్టారు. గదులను భక్తులకు అధిక ధరలకు విక్రయించి దోపిడీకి పాల్పడుతున్నారు. 10వేల చదరపు గజాల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. శారదా పీఠం ఆక్రమణలు కూల్చకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధం’’ అని శ్రీనివాసానంద సరస్వతి హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని