
AP News: కరోనా ఎఫెక్ట్...శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయాలు
శ్రీశైలం: తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు భారీగా నమోదువుతున్న నేపథ్యంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల స్వామివారి సర్వదర్శనం నిలిపివేస్తున్నట్టు ఈవో లవన్న తెలిపారు. అన్నప్రసాద వితరణ, పుణ్య స్నానాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇకపై రోజుకు నాలుగు విడతల్లో సామూహిక అభిషేకాలు ఉంటాయని వెల్లడించారు. ఈనెల 18 నుంచి అర్జిత సేవల టికెట్లు ఆన్లైన్లో పొందాల్సి ఉంటుందని, శ్రీఘ్ర, అతిశ్రీఘ్ర దర్శనం టికెట్లు కూడా ఆన్లైన్ ద్వారా పొందే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు కొవిడ్ వ్యాక్సినేషన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని ఈవో స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.