TTD: ఇక తిరుపతిలోనే శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు: తితిదే

తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు తిరుపతిలోనే మంజూరు చేస్తున్నట్టు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను బుధవారం ఆయన ప్రారంభించారు.

Published : 01 Dec 2022 01:21 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ ఆఫ్‌లైన్‌ టికెట్లు తిరుపతిలోనే  జారీ చేస్తున్నట్టు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. మాధవం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను బుధవారం ఆయన ప్రారంభించారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళం ఇచ్చి, రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటి  వరకు తిరుమలలోనే ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేశామని తెలిపారు.

ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తితిదే యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి, ఇక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని తెలిపారు. తొలివిడతలో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామన్నారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు