TTD: ఫిబ్రవరి 9న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేయనుంది.

Updated : 08 Feb 2023 00:04 IST

తిరుమల: ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఆన్‌లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams) (తితిదే) విడుదల చేయనుంది. శ్రీవారి ఆలయంలో ఆన్‌లైన్ ఆర్జిత వర్చువల్‌ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోటాతోపాటు, వాటికి సంబంధించిన దర్శన కోటాను ఫిబ్రవరి 9న ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. లక్కీడిప్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8న ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుందని తితిదే తెలిపింది. ఇతర ఆర్జిత సేవా టికెట్లను  ఈ నెల 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్‌ చేసుకోవాలని తితిదే సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని