18న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గురువారం ఉదయం 9గంటలకు విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన

Published : 17 Aug 2022 02:06 IST

తిరుమల: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గురువారం ఉదయం 9గంటలకు విడుదల చేయనుంది. అక్టోబరు నెలకు సంబంధించిన కోటాను తితిదే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. అయితే వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని ఇప్పటికే తితిదే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు తితిదే అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ దర్శనాన్ని బుక్ చేసుకోవాల్సిందిగా సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని