Exam dates: SSC సీజీఎల్‌ టైర్‌- 2; సీహెచ్‌ఎస్‌ఎల్‌ టైర్‌- 1 పరీక్ష తేదీలివే..

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మార్చిలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ(SSC) ప్రకటించింది.

Published : 06 Feb 2023 18:00 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(SSC) గతేడాది కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ లెవెల్‌ (సీజీఎల్‌), కంబైన్డ్‌  హయ్యర్‌ సెకండరీ పరీక్ష(సీహెచ్‌ఎస్‌ఎల్‌)కు నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీజీఎల్‌ టైర్‌- 1 పరీక్షను పూర్తి చేసిన ఎస్‌ఎస్‌సీ.. తాజాగా టైర్‌ 2 పరీక్ష తేదీలను ఖరారు చేసింది. గ్రూప్‌ బి, సీ విభాగాల్లో సుమారు 20వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ పరీక్షను మార్చి 2 నుంచి 7వరకు నిర్వహించనున్నట్టు సోమవారం ప్రకటించింది. అలాగే, 4500 లోయర్‌ డివిజన్‌ క్లర్కులు, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర ఉద్యోగాలను భర్తీకి కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ పరీక్ష టైర్‌- 1ను మార్చి 9 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తమ అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/లో పొందొచ్చని అభ్యర్థులకు సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని