SSC Jobs: ఎస్‌ఎస్‌సీ నుంచి మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
దేశంలో 5,369 ఉద్యోగాల భర్తీకి ఎస్‌ఎస్‌సీ(SSC) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, అకౌటెంట్, రీసెర్చి ఇన్వెస్టిగేటర్, టెక్నికల్ అసిస్టెంట్ సహా మొత్తం 5,369 ఉద్యోగాల సోమవారం (మార్చి 6) నుంచే దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆయా ఉద్యోగాలను బట్టి మెట్రిక్యులేషన్ మొదలుకొని గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు మార్చి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
ముఖ్యాంశాలివే..
- మొత్తం ఉద్యోగ ఖాళీలు: 5,369; అభ్యర్థుల వయస్సు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
- వయస్సులో సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
- ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
- పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ (25 ప్రశ్నలకు 50 మార్కులు); జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు- 50 మార్కులు); క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు 50 మార్కులు), ఇంగ్లిష్ (25 ప్రశ్నలు 50 మార్కులు) చొప్పున ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.
- మార్చి 6 నుంచి 27వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. మార్చి 28 రాత్రి 11గంటల వరకు దరఖాస్తు రుసుం చెల్లించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో పొరపాట్లను సరిదిద్దుకొనేందుకు ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను జూన్- జులై మాసాల్లో నిర్వహించే అవకాశం ఉంది.
- దరఖాస్తు ఫీజు: రూ.100. భీమ్ యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
- తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Rahul gandhi: రాహుల్ గాంధీపై అనర్హత వేటు
-
India News
Opposition Protest: రోడ్డెక్కిన ప్రతిపక్ష ఎంపీలు.. దిల్లీలో తీవ్ర ఉద్రిక్తత
-
India News
లండన్‌లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య..కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు
-
Politics News
Panchumarthi Anuradha : చంద్రబాబును కలిసిన పంచుమర్తి అనురాధ
-
General News
CAG: రూ.6,356 కోట్లు మురిగిపోయాయి: ఏపీ ఆర్థికస్థితిపై కాగ్ నివేదిక
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్