Hyderabad: తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖుల రాక

నూతనంగా నిర్మించిన  తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.

Published : 24 Jan 2023 14:06 IST

హైదరాబాద్‌: నూతనంగా నిర్మించిన  తెలంగాణ సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వేదపండితులు సూచించిన ప్రకారం ఫిబ్రవరి 17 ఉదయం 11.30 నుంచి 12.30 గంటల మధ్య సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముందు వేదపండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, చండీయాగం, సుదర్శనయాగం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. 

సచివాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, బిహార్‌ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌ తరఫున ఆయన ప్రతినిధిగా జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్‌సింగ్‌, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ తదితరులు హాజరవుతారని మంత్రి తెలిపారు. సచివాలయ భవనం ప్రారంభం తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు.

కొత్త సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ పేరును ఖరారు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని