‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థికి రెండు వాహనాలు’

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వారితో పలు విషయాలు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు....

Published : 12 Mar 2021 23:43 IST

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. వారితో పలు విషయాలు చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల పర్యవేక్షణకు ప్రతి అభ్యర్థికి అదనపు వాహనానికి అనుమతిస్తున్నట్లు శశాంక్‌ గోయల్‌ వెల్లడించారు. ఎన్నికల రోజున ప్రతి అభ్యర్థి రెండు వాహనాలను ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యయన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, నేతలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని