AP News: పెంపుడు శునకానికి కాంస్య విగ్రహం

ఆ శునకమంటే ఆయనకు చెప్పలేని అభిమానం. అది దూరమై ఐదేళ్లయినా మర్చిపోలేకపోతున్నారు. ఏటా స్మరించుకుంటున్నారు. ఐదో వర్ధంతికి ఏకంగా దాని కాంస్య విగ్రహం పెట్టించారు....

Published : 24 Jul 2021 00:34 IST

అంపాపురం: ఆ శునకమంటే ఆయనకు చెప్పలేని అభిమానం. అది దూరమై ఐదేళ్లయినా మర్చిపోలేకపోతున్నారు. ఏటా స్మరించుకుంటున్నారు. ఐదో వర్ధంతికి ఏకంగా దాని కాంస్య విగ్రహం పెట్టించారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురానికి చెందిన జ్ఞానప్రకాశ్‌రావు. తన ఇద్దరు కుమార్తెలకు వివాహం జరిపించి అత్తగారింటికి పంపించాక.. ప్రకాశ్‌రావు ఓ కుక్కను పెంచుకున్నారు. దానికి శునకరాజు అని పేరు పెట్టుకుని ఇంటి సభ్యుడిలా చూసుకున్నారు.

అయితే అయిదేళ్ల క్రితం అనారోగ్యంతో ఆ శునకం మృతిచెందింది. దాని జ్ఞాపకాలను మర్చిపోలేక ప్రతి ఏటా శునకరాజు వర్ధంతి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఐదో వర్ధంతిని ఘనంగా జరిపించారు. ‘మా రక్త సంబంధం కాకపోయినా.. ఎక్కువ కాలం మాతో జీవించిన నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఫ్లెక్సీపై రాసి.. శునకం కాంస్య విగ్రహం పెట్టించారు. సంస్మరణ క్రతువు నిర్వహించి భోజనాలు ఏర్పాటుచేశారు. బతికుండగానే మనుషులను మర్చిపోతున్న ఈ రోజుల్లో.. చనిపోయిన శునకాన్ని ఏటా స్మరించుకోవడం ప్రకాశ్‌రావు ప్రేమాభిమానానికి నిదర్శనమని అక్కడివారంతా మెచ్చుకుంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని