Statue of Unity: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ఆ నలుగురు!

పర్యాటక ప్రదేశంలో రూ.1000 కనిపిస్తే చాలు.. చడీ చప్పుడు లేకుండా జేబులో వేసుకెళ్లేవారే ఎక్కువ. అలాంటిది రూ.70వేలు కనిపిస్తే దోచుకెల్తారనే భావిస్తాం. కానీ ఆ నలుగురు అలా చేయలేదు. పర్సులో ఉన్న ఆధారాలను సేకరించి వివరాలు కనుక్కొని మరీ ఆమెకు అందేలా చేశారు. ఇదంతా గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశం, భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్

Published : 22 Sep 2021 22:27 IST

అహ్మదాబాద్‌: ఎక్కడైనా కిందపడి ఉన్న ఓ వంద రూపాయలు కనిపిస్తే చడీ చప్పుడు లేకుండా జేబులో వేసుకునేవారే ఎక్కువ. అలాంటిది రూ.70వేలు కనిపిస్తే?? కానీ ఆ నలుగురూ అలా చేయలేదు. పర్సులో ఉన్న ఆధారాలను సేకరించి వివరాలు కనుక్కొని మరీ ఆమెకు అందేలా చేశారు. ఇదంతా గుజరాత్‌లోని పర్యాటక ప్రదేశం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్ద జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్‌ 19న ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన స్నేహా జలాన్‌ స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని సందర్శించేందుకు వచ్చింది. అనంతరం ఫుడ్‌ కోర్టుకు వెళ్లి అక్కడ తన పర్సులో రూ.70వేల క్యాష్, తాళాలు, ఇతర వస్తువులను మర్చిపోయింది. అదే రోజున అక్కడ గైడ్‌గా పనిచేసే నలుగురు మహిళా సిబ్బంది శాహిని మీనన్‌, సులై పాండ్యా, జ్యోత్స్నా, ప్రతాప్‌ తడ్వి.. మధ్యాహ్నం భోజనానికి ఫుడ్‌కోర్టుకెళ్లగా వాళ్లకు ఈ పర్సు కనిపించింది. వెంటనే అక్కడి సీనియర్‌ అధికారి ప్రతీక్‌ మాతుర్‌కి సమాచారమివ్వగా... పర్సులో ఉన్న ఆధారాల మేరకు ఆమె జాడను కనుకొన్నే ప్రయత్నం చేశారు. పలు నంబర్లకు ఫోన్లు చేసి ఆరాతీశారు. తీరా జలాన్‌ అదే రోజున యూపీ వెళ్లిందని తెలిసింది. ఆమెకు ఫోన్‌ చేస్తే తాను రాలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పింది. గుజరాత్‌లో ఉన్న తన చుట్టాలబ్బాయ్‌కి ఇవ్వాలని విజ్ఞప్తిచేసింది. దీంతో బుధవారం ఆ బంధువుకి ఈ నలుగురూ పోగొట్టుకున్న వస్తువుల్ని అందజేశారు. వారి నిజాయతీని మెచ్చుకుంటూ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ రాజీవ్‌ గుప్తా ట్వీట్‌ చేశారు. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ఛైర్మన్‌, అదనపు చీఫ్‌ సెక్రటరీ వారిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని