
Published : 05 May 2021 16:18 IST
స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె వాయిదా
విశాఖ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తలపెట్టిన సమ్మె వాయిదా పడింది. కొవిడ్ దృష్ట్యా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు యాజమాన్యానికి ఇచ్చిన వాయిదా నోటీసులో కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. తొలుత ఇచ్చిన నోటీసులో భాగంగా కార్మిక సంఘాలు రేపు సమ్మెకు దిగాల్సి ఉంది. అయితే సమస్యలు పరిష్కరించకుంటే మే తర్వాత ఎప్పుడైనా సమ్మె చేస్తామని నోటీసులు వెల్లడించాయి.
ఇవీ చదవండి
Tags :