Vizag Steel Plant: ఉద్యమాలతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారా?: విశాఖలో కార్మికుల భారీ ర్యాలీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు విశాఖ నగరంలోని గాజువాకలో ఆందోళనకు దిగారు.

Updated : 09 Nov 2022 12:03 IST

విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు విశాఖ నగరంలోని గాజువాకలో ఆందోళనకు దిగారు. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ‘ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి గాజువాక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుక శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నామని.. దీన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని కార్మికులు మండిపడ్డారు. ప్రాణత్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని