వ్యాయామ ‘మధు’రిమ!
మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతైనా అవసరం. రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం మంచిదన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే ఏరోబిక్ రకం వ్యాయామాలు బాగా
మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతైనా అవసరం. రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేయటం మంచిదన్నది నిపుణుల సూచన. ముఖ్యంగా గుండె వేగాన్ని పెంచే ఏరోబిక్ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి. వ్యాయామం మూలంగా రక్తంలో గ్లూకోజు నియంత్రణలో ఉండటం దగ్గర్నుంచి గుండె జబ్బుల ముప్పు తగ్గటం వరకూ రకరకాల ప్రయోజనాలు చేకూరుతాయి.
![]() |
గ్లూకోజు నియంత్రణ రక్తంలో గ్లూకోజు మోతాదుల నియంత్రణకు వ్యాయామం తోడ్పడుతుంది. మందులు వేసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేసేవారిలో బరువు తగ్గకపోయినా కూడా మూడు నెలల కాలంలో గ్లూకోజు సగటును తెలిపే హెచ్‌బీఏ1సీ 0.7% మెరుగుపడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. |
![]() |
గుండెజబ్బు ముప్పు తగ్గుముఖం ఏ మాత్రం వ్యాయామం చేయని మధుమేహులతో పోలిస్తే వారానికి కనీసం రెండు గంటల పాటు నడిచిన వారికి గుండెజబ్బుతో మరణించే ముప్పు తక్కువ. అదే వారానికి 3-4 గంటల సేపు నడిస్తే ఇంకాస్త ఎక్కువ ఫలితమే కనిపిస్తుంది. వ్యాయామం మూలంగా చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండెజబ్బు ముప్పూ తగ్గుతుంది. |
![]() |
రక్త ప్రసరణ మెరుగు నడవటం, నెమ్మదిగా పరిగెత్తటం, సైకిల్ తొక్కటం, ఈత వంటివి గుండె వేగం పెరిగేలా చేస్తాయి. ఇది ఇన్సులిన్ సమర్థంగా పనిచేయటానికి తోడ్పడుతుంది. అంతేకాదు, అవయవాలకు.. ముఖ్యంగా కిడ్నీలు, మెదడు, గుండె, కళ్ల వంటి వాటికి రక్త ప్రసరణ ఇనుమడిస్తుంది. రక్తంలో గ్లూకోజు స్థాయులు అదుపులో లేనివారిలో ఇలాంటి కీలక అవయవాలన్నీ దెబ్బతింటుండటం చూస్తున్నదే. |
![]() |
శరీర సామర్థ్యం పెరుగుతుంది వ్యాయామం చేసినప్పుడు అన్ని కణజాలాలకు ఆక్సిజన్, పోషకాలు బాగా అందుతాయి. దీంతో కండరాలు బలం పుంజుకుంటాయి. శరీర సామర్థ్యం ఇనుమడిస్తుంది. గుండె రక్తనాళాల వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గుండె, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే రోజువారీ పనులు చేసుకోవటానికి మరింత శక్తి లభిస్తుంది. |
![]() |
ఒత్తిడి తగ్గుతుంది వ్యాయామంతో ఒత్తిడికి దారితీసే అడ్రినలిన్, కార్టిజోల్ హార్మోన్ల స్థాయులు తగ్గుతాయి. అదే సమయంలో మెదడులో ఎండార్ఫిన్లనే నాడీ సమాచార వాహకాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి. ఫలితంగా ఒత్తిడీ తగ్గుతుంది. అంతేనా? వ్యాయామంతో ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే. |
![]() |
బరువు అదుపు వ్యాయామంతో కండరాలు బలోపేతం కావటమే కాదు, కండరాల జీవక్రియల వేగమూ పెరుగుతుంది. అంటే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనూ క్యాలరీలు ఖర్చవుతుంటాయన్నమాట. ఇలా బరువు అదుపులో ఉండటానికీ వ్యాయామం తోడ్పడుతుంది. |
![]() |
రక్తపోటు తగ్గుముఖం వ్యాయామం చేయటం ద్వారా గుండె బలోపేతం అవుతుంది. తక్కువ శ్రమతోనే సమర్థంగా రక్తాన్ని పంప్ చేయటానికి వీలవుతుంది. ఫలితంగా ధమనులపై ఒత్తిడి తగ్గుతుంది. రక్తపోటూ తగ్గుముఖం పడుతుంది. |
![]() |
జాగ్రత్త సుమా! వ్యాయామం విషయంలో మధుమేహులు తగు జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. డాక్టర్ సలహా మేరకు ఎప్పుడెప్పుడు, ఎలాంటి వ్యాయామాలు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. ఇన్సులిన్ తీసుకునేవారైతే ఇంకాస్త ఎక్కవ జాగ్రత్తగా ఉండాలి. వ్యాయామం చేయటానికి ముందు గ్లూకోజు స్థాయులను పరీక్షించుకోవటం మంచిది. గ్లూకోజు 100 ఎంజీ/డీఎల్ కన్నా తక్కువుంటే ఏదో ఓ పండు ముక్కో, చిన్న చిరుతిండో నోట్లో వేసుకుంటే గ్లూకోజు స్థాయులు మరీ దిగువకు పడిపోకుండా (హైపోగ్లైసీమియా) చూసుకోవచ్చు. మరో 30 నిమిషాల తర్వాతా గ్లూకోజును పరీక్షించుకోవాలి. దీంతో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉంటున్నాయా? లేదా? అన్నది తెలుస్తుంది. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: బాల సుబ్రహ్మణ్యంకు కోపం వచ్చిన వేళ.. అలా నటుడిగా మారిన కె.విశ్వనాథ్
-
India News
Parliament: రెండోరోజూ అదానీ ఎఫెక్ట్.. వాయిదా పడిన ఉభయ సభలు
-
General News
Andhra News: వివేకా హత్య కేసు.. సీబీఐ ముందుకు జగన్ ఓఎస్డీ
-
Politics News
Kakani Govardhan Reddy: అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్: కోటంరెడ్డికి మంత్రి కాకాణి కౌంటర్
-
Movies News
Writer Padmabhushan Review: రివ్యూ: రైటర్ పద్మభూషణ్
-
Sports News
Virat Kohli: స్పిన్ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!