Hyderabad: బాలానగర్‌లో వీధి కుక్క స్వైర విహారం.. 16 మందిపై దాడి

హైదరాబాద్‌లోని బాలానగర్‌ పరిధి వినాయక్‌నగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి.

Updated : 12 Mar 2023 10:23 IST

బాలానగర్‌: హైదరాబాద్‌లోని బాలానగర్‌ పరిధి వినాయక్‌నగర్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై కుక్క ఎగబడుతూ కరిచింది. గాయపడిన వారిలో మూడేళ్ల చిన్నారి కూడా ఉంది. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి జోన్‌ డాగ్‌ స్వ్కాడ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని దాదాపు 2 గంటలపాటు శ్రమించి కుక్కను పట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని