hyderabad: చిత్రపురి కాలనీలో మహిళపై వీధికుక్కల దాడి.. సోషల్‌ మీడియాలో వైరల్‌

వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై దాడికి దిగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

Updated : 22 Jun 2024 19:33 IST

హైదరాబాద్‌: వీధి కుక్కల గుంపు నడుచుకుంటూ వెళ్తోన్న ఓ మహిళపై దాడికి దిగిన ఘటన స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వాటి దాడి నుంచి ఆ మహిళ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఈ ఘటన జరిగింది. చిత్రపురి కాలనీలో నడుచుకుంటూ వెళ్తోన్న మహిళపై వీధికుక్కలు దాడికి యత్నించాయి. చుట్టుముట్టిన వీధి శునకాల బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మహిళ గట్టిగా కేకలు వేసింది. వాటి నుంచి తప్పించుకునే  క్రమంలో కిందపడిపోయినా.. కుక్కలను అదిలించే ప్రయత్నం చేసింది. ఇంతలో ఓ ద్విచక్రవాహనదారుడు, కారు రావడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాలన్నీ  సమీపంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. బాధిత మహిళ భర్త ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి.. ఊర కుక్కలకు ఇంటి బయట అన్నం పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ‘‘ఇంటి ముందు కుక్కలకు అన్నం పెడితే నా భార్యకు ఎదురైన పరిస్థితే మీకు కూడా రావొచ్చు’’ అంటూ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని