Telangana News: దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్‌ బోర్డు

జూనియర్‌ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Published : 02 Oct 2022 01:34 IST

హైదరాబాద్‌: జూనియర్‌ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి తెలిపారు. రేపటి నుంచి ఈనెల 9వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, గురుకుల జూనియర్‌ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈనెల 10న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts