Hair fall:జుట్టు రాలుతోందా! అయితే ఇలా చేయండి!

ఆడ, మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న సమస్య జుట్టు రాలడం.

Published : 30 Apr 2022 02:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహిళలు, పురుషులు... చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్‌లో దొరికే వివిధ రకాల క్రీమ్‌లను, షాంపూలు, నూనెలను వాడుతుంటారు. కానీ ఫలితం శూన్యం. అయితే, కొన్ని పద్ధతులు, జాగ్రత్తల ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు.

బిగుతుగా వద్దు: కొంతమంది బిగుతుగా జడ వేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం ద్వారా వెంట్రుకలు మరింత ఎక్కువ రాపిడికి గురై నిర్జీవంగా మారతాయి. పొనీటెల్‌ వేసుకొన్నా.. జడ వేసుకొన్నా కాస్త వదులుగా వేసుకోవాలి.

సిల్క్‌ కవరే ఉత్తమం: పడుకునేటప్పుడు తప్పనిసరిగా దిండుకు(తలగడ) సిల్క్‌ కవర్‌ను వాడడం ఉత్తమం. దీని వల్ల నిద్రపోతున్నపుడు వెంట్రుకలకు రాపిడి తక్కువగా ఉంటుంది. జుట్టు ఊడకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. 

మీకు నప్పుతుందా లేదా: కొంతమంది రకరకాల కండీషనర్లు వాడుతారు. తరచూ కండీషనర్ల బ్రాండులను మారిస్తే జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే కండీషనర్లను మీకు నప్పుతాయా లేదా అని తెలుసుకున్నాకే వాడటం మంచిది.

ప్రయోగాలు వద్దు: ఈ మధ్య ఎక్కువగా హెయిర్‌ స్టైల్స్‌ చేయించుకుంటున్నారు. అందంగా ఉండాలని ఈ ప్రయోగాలు చేస్తున్నప్పటికీ అవి కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరీ ఎక్కువగా హెయిర్‌ స్టైల్స్‌ చేయించుకోకూడదు.

ఏది పడితే అది వద్దు: ప్రస్తుతం మార్కెట్‌లో రకరకాల సీరమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలా అని ఎక్కువగా వాడేయకూడదు. దీని వల్ల హెయిర్‌ డామేజ్‌ అయ్యే అవకాశాలున్నాయి.

వీటితో పాటు మంచి నిద్ర, ఒత్తిడి లేని జీవితంతో కురులు ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే ఏ విషయం గురించైనా ఎక్కువగా ఆలోచించకండి. సమయానికి ఆహారం తీసుకోండి. రోజూ వ్యాయామం చేయండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని