Student: అంబులెన్స్‌లో వచ్చి... పరీక్ష రాసి..

ఎంత కఠినమైన పరీక్షలు దాటితే మనిషి అంత గొప్పవాడు అవుతాడు. ఈ విద్యార్థినికి పరీక్షల సమయంలోనే జీవితం పరిక్ష పెట్టింది.

Published : 05 May 2022 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితం ఒక పరీక్షలాంటిది.అయితే ఈ విద్యార్థినికి పరీక్షల సమయంలోనే జీవితం పరీక్ష పెట్టింది. సంవత్సరమంతా కష్టపడి చదివి పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ దగ్గరపడే సమయానికి శస్త్రచికిత్స చేయించుకోవల్సి వచ్చింది. అయినా పట్టుదలతో చికిత్స జరిగిన మూడోరోజే అంబులెన్స్‌లో వచ్చి పరీక్షరాసి చదువుపై తనకున్న శ్రద్ధను నిరూపించుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు తిరుప్పూర్‌ జిల్లా కుప్పండంపాళయంకు చెందిన రిథానియా (17) మే 5నుంచి పరీక్షలు కాగా, మే2న తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ఆ బాలిక పేగులకు రక్తం సరఫరా చేసే సిరల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయిందని ల్యాప్రోస్కోపీ చేయాలని చెప్పారు. శస్త్రచికిత్స అనంతరం ఆ బాలిక పరీక్షలకు హాజరవుతానని వైద్యులను కోరింది. దీంతో ఆసుపత్రి వాళ్లు అంబులెన్స్‌లో ఆ బాలికను పరీక్ష కేంద్రాలయానికి పంపించారు. వైద్య సిబ్బంది సమక్షంలో ఆమె పరీక్షను రాసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని