అత్యంత వేగంగా ఆవర్తన పట్టిక రాసి రికార్డు

రసాయనశాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను అత్యంత వేగంగా రాసి మహబూబ్‌నగర్‌ విద్యార్థి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న మురళీ కార్తీక్‌ 81 సెకన్లలో....

Published : 15 Feb 2021 01:09 IST

మహబూబ్‌నగర్‌: రసాయనశాస్త్రంలోని 118 మూలకాల ఆవర్తన పట్టికను అత్యంత వేగంగా రాసి మహబూబ్‌నగర్‌ విద్యార్థి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న మురళీ కార్తీక్‌ 81 సెకన్లలో ఆవర్తన పట్టికను రాసి రికార్డు సృష్టించాడు. గతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని 117 సెకన్లలో ఆవర్తన పట్టికను రాసి రికార్డు నెలకొల్పగా.. ఆ రికార్డును మురళీ కార్తీక్‌ అధిగమించాడు. దీంతో వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు విద్యార్థికి ప్రశంసాపత్రం, పురస్కారాన్ని అందించారు. ఇండియన్‌ నేవీ లేదా ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకునే తన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు కార్తీక్‌ పేర్కొన్నాడు.

ఇవీ చదవండి...

పొలానికి హెలికాప్టర్‌లో వెళ్లాలి.. రుణం ఇప్పించండి

ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని