Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. విద్యార్థి సంఘాల ఆందోళన

కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Updated : 22 Jun 2024 12:54 IST

హైదరాబాద్‌: కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నీట్‌ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్‌తో పలు సంఘాల నేతలు ఆయన ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈక్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని నల్లకుంట పోలీసు స్టేషన్‌కు తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని