కొవిడ్‌: వాసన కోల్పోవడం వారిలోనే ఎక్కువ!

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, జ్వరం, గొంతు నొప్పి.. ఇవన్నీ కొవిడ్‌-19కు సంబంధించిన లక్షణాలే. కొందరిలో మాత్రమే వాసన, రుచి కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. వీటి ఆధారంగానే పరీక్షలు చేయించుకున్న........

Updated : 12 Aug 2022 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జలుబు, జ్వరం, గొంతు నొప్పి.. ఇవన్నీ కొవిడ్‌-19కు సంబంధించిన లక్షణాలే. కొందరిలో మాత్రమే వాసన, రుచి కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. వీటి ఆధారంగానే పరీక్షలు చేయించుకున్న తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌ తేలిన వారూ ఉన్నారు. అయితే, రుచి, వాసన కోల్పోవడానికి సంబంధించి ఆసక్తికర వివరాలను పరిశోధకులు వెల్లడించారు. స్వల్ప స్థాయి కొవిడ్‌ ఉన్నవారిలోనే ఎక్కువగా ఇలా జరగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

18 యూరోపియన్‌ ఆస్పత్రుల్లో సుమారు 2,581 మందిపై పరిశోధన అనంతరం ఆ వివరాలను పరిశోధకులు పంచుకున్నారు. ఈ అధ్యయనం జర్నల్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌లో ప్రచురితమైంది. స్వల్ప స్థాయిలో కొవిడ్‌ బారిన పడిన వారిలో దాదాపు 85.9 శాతం మందిలో వాసన, రుచి కోల్పోవడాన్ని గుర్తించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. మధ్యస్థ స్థాయి తీవ్రత కలిగిన కేసుల్లో 4.5 శాతం మంది, తీవ్ర స్థాయి కేసుల్లో 6.9 శాతం మందిలో మాత్రమే ఈ విధంగా జరిగినట్లు గుర్తించామన్నారు. అలాగే ఒకసారి వాసన కోల్పోయిన తర్వాత 18 నుంచి 21 రోజుల్లో రోగి యథావిధిగా కోలుకున్నట్లు తెలిపారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే దాదాపు ఆరు నెలల వరకు సమయం పట్టిందని పరిశోధకులు పేర్కొన్నారు. అలాగే, పెద్దలతో పోలిస్తే ఎక్కువగా యువకుల్లోనే వాసన కోల్పోవడం ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని, అయితే మరిన్ని పరిశోధనలు దీనికి అవసరమని వివరించారు.

ఇవీ చదవండి..
మా వ్యాక్సిన్‌తో రెండేళ్లపాటు ఇమ్యూనిటీ..!
టీకా వేయించుకున్నా..మాస్కులు ఎందుకంటే..?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని