Andhra news: వేసవి క్రీడా శిబిరాలు ఉచితం అన్నారు.. రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు..!

వేసవి క్రీడా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి.. విద్యార్థుల నుంచి రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ గుంటూరు బీఆర్‌ స్టేడియం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు.

Published : 16 May 2022 15:34 IST

గుంటూరు: వేసవి క్రీడా శిబిరాలు ఉచితంగా నిర్వహిస్తున్నామని ప్రకటించి.. విద్యార్థుల నుంచి రూ.వేలల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ గుంటూరు బీఆర్‌ స్టేడియం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ఫీజులు పెంచి విద్యార్థులను క్రీడలకు దూరం చేస్తున్నారని వివిధ పార్టీల నేతలు, తల్లిదండ్రులు మండిపడ్డారు. చెత్తమీద పన్ను వేసిన ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మానసిక వికాసం కోసం ఉపయోగపడే ఇలాంటి వాటిని కూడా ఒక వ్యాపార సామగ్రిగా ఉపయోగించుకోవడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సమ్మర్‌ క్యాంప్‌ అడ్మిషన్‌ ఫీజు రూ.వంద ఉండేదని దాన్ని భారీగా పెంచారని ఆరోపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని