‘సుమో’ యోధుడికీ కరోనా!

తొలిసారిగా ఓ సుమో యోధుడికి కరోనా వైరస్‌ సోకినట్టు జపాన్‌ సుమో అసోసియేషన్‌ ప్రకటించింది.

Updated : 05 Jan 2021 15:52 IST

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రాచీన మల్లయుద్ధ కళ సుమో. ఇది ఆ దేశ జాతీయ క్రీడ కూడా.ఈ విధానంలో పోరాడే వారిని రికిషి యోధులంటారనే సంగతి తెలిసిందే. భారీ కాయానికి మారుపేరైన మహా యోధుల మధ్య జరిగే పోరాటాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. కాగా, తొలిసారిగా ఓ సుమో యోధుడికి కరోనా వైరస్‌ సోకినట్టు జపాన్‌ సుమో అసోసియేషన్‌ నేడు ప్రకటించింది.

సుమో యోధులు అత్యంత నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. వీరి దినచర్య శిక్షణ, అభ్యాసం, కఠిన నియమ నిబంధనలతో కూడి ఉంటుంది. వీరికి కారు నడపటం నిషిద్దం. చలి కాలంలో కూడా వీరు యుకాటా అనే పలుచని కాటన్‌ వస్త్రాన్ని మాత్రమే నడుము చుట్టూ ధరించాల్సి ఉంటుంది. ఐతే ఇంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ.. ఎన్నో పోటీల్లో గణనీయమైన విజయాలు సాధించిన హకుహో అనే ఓ సుమో యోధుడికి వాసన తెలియకపోవటం తదితర లక్షణాలు కనపడ్డాయట. ఈ క్రమంలో చేసిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలో  ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

పన్నెండున్నర కోట్ల జనాభా ఉన్న జపాన్‌లో ఇప్పటి వరకు కేవలం మూడువేల ఐదువందల కొవిడ్‌-19 మరణాలు నమోదయ్యాయి. దీనితో ఆ దేశం కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా కట్టడి చేసిందనే చెప్పాలి. ఐతే ఇటీవల కొద్ది వారాల నుంచి కేసుల సంఖ్య పెరుగుతూ రావటం గమనార్హం.

ఇవీ చదవండి..

హెల్త్‌ కార్డ్‌ కోసం క్యూలో సీఎం..

2020 టిప్‌ ఛాలెంజ్‌..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు