Bird: సూపర్‌ బర్డ్‌.. జెట్‌ స్పీడ్‌లో 13వేల కి.మీల ప్రయాణం!

కొన్ని పక్షులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటాయి. అలాగే, గాడ్విట్‌ రకం పక్షి కూడా ఇటీవల అలస్కా నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. అందులో వింతేముంది అంటారా? ఆ పక్షి నిర్విరామంగా 239 గంటలు ఎగురుతూ 13వేల కి.మీ ప్రయాణించి

Published : 13 Nov 2021 01:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొన్ని పక్షులు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోగానే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తుంటాయి. అలాగే, గాడ్విట్‌ రకం పక్షి కూడా ఇటీవల అలస్కా నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. అందులో వింతేముంది అంటారా? ఆ పక్షి నిర్విరామంగా 239 గంటలు ఎగురుతూ 13వేల కి.మీ ప్రయాణించి రికార్డు సృష్టించింది మరి. సాధారణంగా పక్షులు గుంపులు గుంపులుగా ప్రయాణిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఒంటరిగానూ ప్రయాణిస్తాయి. 4BBRW పేరు గల గాడ్విట్‌ పక్షి కూడా ఒంటరిగా సెప్టెంబర్‌ 17న అలస్కా నుంచి పయనమైంది. జెట్‌ విమాన వేగంతో సమానంగా 13వేల కి.మీ ప్రయాణించి సెప్టెంబర్‌ 27న ఆస్ట్రేలియాకు చేరుకుంది. మధ్యలో ఆకలిస్తే.. ఎగురుతూనే ఎదురపడ్డ కీటకాల్ని తింటూ కడుపు నింపుకొందట. ఈ పక్షి ప్రయాణాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ఈ వివరాలను వెల్లడించారు.

గాడ్విట్‌ పక్షి బరువు సుమారు 400 గ్రాములు ఉంటుంది. దీని ఆకృతి జెట్‌ విమానం మాదిరిగా ఉంటుందని, అదే పక్షి వేగంగా వెళ్లడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం పక్షి ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి టాస్మాన్‌ సముద్రంపై ప్రయాణిస్తోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని