Supreme Court: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) విధించిన స్టే ఎత్తివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 

Updated : 17 May 2023 17:02 IST

దిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Court)లో ఏపీ ప్రభుత్వాని (AP Govt)కి ఎదురుదెబ్బ తగిలింది. మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (NGT) విధించిన స్టే ఎత్తివేతకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. 

గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపడుతున్న ఆవులపల్లి, నేతిగుట్టపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల పనుల్ని వెంటనే ఆపాలని గతంలో ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీచేసింది. ప్రాజెక్టు పనుల్లో ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వానికి  రూ.100 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించింది. అయితే జరిమానాపై పాక్షికంగా స్టే ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణా బోర్డుకు రూ.25కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని