Supreme court: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల కొనసాగింపునకు సుప్రీం అనుమతి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల కొనసాగింపునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Published : 17 Feb 2023 15:25 IST

దిల్లీ: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. అయితే తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దని, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఆలోచనతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.

మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై స్టే విధించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. ఆరు వారాల్లో ప్రతివాదులంతా కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని