ఆ మూడు గ్రామాలు మావే: ఏపీ  

ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Updated : 19 Feb 2021 14:51 IST

దిల్లీ: ఒడిశా ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ భూ భాగంలోని 3 గ్రామ పంచాయతీల పేర్లు మార్చి ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఒడిశా ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఒడిశా పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున విజయనగరం జిల్లా కలెక్టర్‌   కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. కోటియా పరిధిలోని 3 గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో భాగమేనని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

 ఏపీ ప్రభుత్వం గతంలోనూ అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి మూడు గ్రామాలు వస్తాయని, ఒడిశా పిటిషన్‌ కొట్టివేయాలని విజయనగరం కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు ఒడిశా ప్రభుత్వం తరఫు న్యాయవాది వికాస్‌సింగ్‌ నాలుగువారాల గడువు కోరారు. దీంతో ఈకేసు తదుపరి విచారణను జస్టిస్‌ ఖన్‌ విల్కర్‌ ధర్మాసనం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని