వైద్య పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

తెలంగాణలో వైద్య పీజీ ప్రవేశాలను గడువు ఆగస్టు 31 వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ...

Published : 30 Jul 2020 12:43 IST

దిల్లీ: తెలంగాణలో వైద్య పీజీ ప్రవేశాలను గడువు ఆగస్టు 31 వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం, కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌పై తెలంగాణ వైద్య కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 

కాళోజీ వర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పీజీ ప్రవేశాలకు తక్కువ గడువు ఇచ్చారని, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఇచ్చిన గడువు సరిపోదని వైద్య కళాశాలలు సుప్రీంకోర్టుకు విన్నవించాయి. విద్యార్థులు అడ్మిషన్లకు వెళ్లేందుకు సమాయత్తం కావాల్సి ఉంటుందని, అందుకు సమయం సరిపోదని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న త్రిసభ్య ధర్మాసనం వైద్య పీజీ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని