ఎన్జీటీ తీర్పులోని మిగతా అంశాలు అమలు చేయాలి: ఏపీ సర్కారుకి సుప్రీం ఆదేశం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని ఎన్జీటీ విధించిన నష్టపరిహారంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఎన్జీటీ ఇచ్చిన తీర్పులో అన్ని అంశాలు అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

Updated : 17 Oct 2022 20:56 IST

దిల్లీ: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై ఎన్జీటీ సంయుక్త కమిటీ విధించిన నష్టపరిహారాన్ని వెంటనే జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎన్జీటీ తీర్పులో అన్ని అంశాలు యథాతథంగా అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. రూ.250 కోట్ల పరిహారంపై తదుపరి విచారణ కొనసాగిస్తామని.. అప్పటివరకు ఎన్జీటీ తీర్పులోని మిగిలిన అంశాలు అమలు చేయాలని సూచించింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఏపీ ప్రభుత్వానికి జరిమానా విధిస్తూ ఇటీవల ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నంకు రూ.2.48 కోట్లు, పట్టిసీమకు రూ.1.90 కోట్లు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఎన్జీటీ సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపడతామని ధర్మాసనం తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని