Andhra News: ఆ బకాయిలపై సమాధానం చెప్పండి: ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు

ఏపీ రాజధాని కోసం పనిచేసిన ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌

Updated : 11 Aug 2022 14:14 IST

అమరావతి: ఏపీ రాజధాని కోసం పనిచేసిన ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని ఆర్బిట్రేషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సంస్థ గతంలో రాజధాని నిర్మాణ ప్రణాళిక, భవన ఆకృతులను రూపొందించింది.

2019 జూన్‌ తర్వాత నుంచి రావాల్సిన బకాయిలపై పలుమార్లు అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ అభివృద్ధి అథారిటీ (ఏఎంఆర్‌డీఏ)కి లేఖలు, నోటీసులు పంపినా సమాధానం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మధ్యవర్తిత్వం ద్వారా నిధులను ఇప్పించాలని కోరింది. ఫోస్టర్‌ సంస్థ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఏఎంఆర్‌డీఏకి న్యాయస్థానం నోటీసులు జారీచేసింది.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts