Supreme Court: ఏపీ మాజీ సీఎస్‌ సమీర్‌ శర్మకు సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ సమీర్‌ శర్మకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రకటించిన పరిహారం అందించడంలో కోర్టు ఉత్తర్వులు పాటించలేదని వెంకట్‌ రెడ్డి అనే నిర్వాసితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 23 Jan 2023 21:29 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ సమీర్‌ శర్మకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రకటించిన పరిహారం అందించడంలో కోర్టు ఉత్తర్వులు పాటించలేదని వెంకట్‌ రెడ్డి అనే నిర్వాసితుడు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. పరిహారం చెల్లింపులో కోర్టు ఉత్తర్వులు అమలుపై సమాధానం చెప్పాలని సమీర్‌ శర్మకు నోటీసులు జారీ చేసింది. అదే సందర్భంలో పిటిషనర్‌ని సైతం ధర్మాసనం హెచ్చరించింది. ఒకవేళ ప్రభుత్వం పరిహారం అంతా చెల్లించినట్లు రుజువైతే... భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. పిటిషన్‌పై తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని