Supreme Court: ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారం.. విచారణ ఎల్లుండికి వాయిదా

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ నిబంధనల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Published : 24 May 2023 14:03 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ నిబంధనల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ పీఎస్‌ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇదో 8వ వింత అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాము కౌంటర్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఒక్కరోజు సమయం ఇచ్చి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.  తాము కూడా ప్రత్యేక ఎస్‌ఎల్‌పీని దాఖలు చేసినట్లు గంగిరెడ్డి తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గంగిరెడ్డి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ, ఇతర అప్లికేషన్లను సునీత పిటిషన్‌కు జత చేయాలని ధర్మాసనం సూచించింది. అన్నింటినీ కలిపి విచారిస్తామంటూ తదుపరి విచారణను ఈనెల 26కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని