Supreme Court: ఎమ్మెల్యేలకు ఎర కేసు..అప్పటి వరకూ యథాతథ స్థితి: సుప్రీంకోర్టు

తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది.

Published : 13 Mar 2023 13:14 IST

దిల్లీ: తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలకు ఎర కేసుపై విచారణను సుప్రీంకోర్టు(Supreme Court) వాయిదా వేసింది. దీనిపై వేసవి సెలవుల తర్వాత విచారణ చేస్తామని తెలిపింది. జులై 31 నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్‌లేనియస్‌ పిటిషన్‌ కింద విచారణ జరుపుతామని.. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 

ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని