Supreme Court: రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చండి: సుప్రీం కోర్టు

కస్టోడియల్‌ టార్చర్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ

Published : 07 Sep 2022 16:21 IST

దిల్లీ: కస్టోడియల్‌ టార్చర్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. రెండున్నరేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని.. సీబీఐ విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వ వాదనలతో పనిలేదని భరత్‌ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ప్రభుత్వ వాదన విన్న తర్వాతే సీబీఐ విచారణపై నిర్ణయిస్తామని చెప్పిన ధర్మాసనం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని